గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక..
గన్నవరం, మేజర్ న్యూస్ : విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీలోని మొత్తం 14 వార్డులకు గాను 11 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఈ నేపథ్యంలో నూతన సర్పంచ్ నిఖిల్ ఆదివారం విజయవాడలోని కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు నూతన సర్పంచ్‌కు అభినందనలు తెలియజేశారు. యువత రాజకీయాల్లోకి రావడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు. సర్పంచ్ పదవిని బాధ్యతగా స్వీకరించి, గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆకాంక్షించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గన్నవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.