జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్
జగ్గయ్యపేట మేజర్ న్యూస్: నందిగామ పట్టణంలో బొజ్జా డెంటల్ నూతన శాఖను మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. జగ్గయ్యపేటలో ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన బొజ్జా డెంటల్, ఇప్పుడు నందిగామలో కూడా తన సేవలను విస్తరించడం అభినందనీయమని ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. డాక్టర్ బొజ్జా రాజేష్, డాక్టర్ సౌమ్య ల ఆధ్వర్యంలో మరింత విస్తరిస్తున్న ఈ సంస్థ జగ్గయ్యపేట, నందిగామ ప్రాంత ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందిస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డాక్టర్ బొజ్జా రాజేష్, డాక్టర్ సౌమ్య లకు అభినందనలు తెలియజేస్తూ, బొజ్జా డెంటల్ మరిన్ని శాఖలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, జగ్గయ్యపేట నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.