ఇంద్రకీలాద్రిపై వైభవంగా కార్తీక మాస పూజలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో ట్రస్ట్ బోర్డు సభ్యులు పద్మావతి ఠాకూర్, సరిత, పర్యవేక్షకురాలు హేమ దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.