BREAKING
పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం

ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ

Select Suryaa Now
ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్  -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, మామండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి విద్యార్థినిపై దాడి చేసిన స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్) టి.మనోహర్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నోట్‌బుక్‌లో రాతపని సకాలంలో పూర్తి చేయలేదనే కారణంతో విద్యార్థినిని కొట్టినట్లు తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ నిర్వహించి, ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ప్రాథమికంగా ఆరోపణలు నిర్ధారణ కావడంతో నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మామండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్) టి.మనోహర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినిపై జరిగిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, బాధ్యతల పట్ల అలసత్వం చూపినట్లు పేర్కొంటూ, సంబంధిత ప్రధానోపాధ్యాయుడు మూడు రోజుల్లో వివరణ సమర్పించాలని డీఈఓ ఆదేశించారు. గడువులోగా వివరణ అందించకపోతే, వివరణ లేనట్లుగా పరిగణించి నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణా చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్