కేంద్ర మంత్రి ఘన సన్మానం
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కేంద్ర పంచాయతీ రాజ్, పశుసంవర్ధక శాఖ మంత్రి ఎస్పి.సింగ్ బఘేల్‌ను సౌత్ ఇండియా కురుబ, కురుమ, కురుంబన్, దంగల్ సంఘం అధ్యక్షులు, సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఆయన ఇటీవల ములకలచెరువు జడ్పిటిసిగా ఎన్నికైన జబ్బల మీనాతో కలిసి శనివారం కేంద్ర మంత్రిని ఓ ప్రైవేట్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆమె మండల అభివృద్ధికి నిధులు కావాలని కోరారు. తన శాఖ తరపున నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని, ఈ విషయమై త్వరలోనే ఢిల్లీకి రావాలని ఆహ్వానం తెలిపారని జబ్బల శ్రీనివాసులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేత జల్లి మధుసూదన్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్