ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎల్ఐసి రోడ్డులోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం యూజీ విద్యార్థులతకు రీడింగ్, రైటింట్, లిజనింగ్, స్పీకింగ్ విభాగాలకు సంభందించి కాన్ఫ్లూయెన్స్- 2026 పేరిట విన్నుత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డైరెక్టర్లు గిరిధర్, విశ్వనాథ్ లు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ తత్వప్రపంచంలో విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణించి, భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలు అదిరోహించాలంటే ఆంగ్ల భాషాపై పట్టు సాధించాలని సూచించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే విద్యార్థులు ఆంగ్ల భాష దృష్టి సారించాలన్సి అవసరం ఉందన్నారు. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ మునిరత్నం స్పీకింగ్ లో కీర్తన, శ్రియజైన్, లిజనింగ్ లో విష్ణువర్ధన్ రెడ్డి, సాయితేజ, రైటింగ్ లో ధరణీశ్వరి, లీన, రీడింగ్ లో యోషిని, వైష్ణవిని విజేతలుగా ప్రకటించగా డైరెక్టర్ గిరిధర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాఫర్‌వల్లీ, ఫ్యాకల్టీ వసుంధర, భాగ్యశ్రీ, హర్షవర్ధిని, వేదవల్లి, జాషువా భానుకిరణ్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్