BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు

Select Suryaa Now
కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు

ఝ‌రాసంగం l ః ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామ శివారులో ఆలయం వద్ద నిర్వహించిన వనభోజన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హన్మంతరావు పాటిల్, నందకుమార్ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండలం లోని వివిధ గ్రామాల సర్పంచ్ లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు డప్పుర్ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకేచోట చేరి ఆత్మీయంగా వనభోజనాల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆనందంగా గడిపారు.ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా గ్రామాల మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమం అందరి భాగస్వామ్యంతో విజయవంతమైంది.