తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం
తాడిగడప, మేజర్ న్యూస్: తాడిగడప మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా 16వ వార్డులో బోడె హేమ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 16వ వార్డు కూటమి అభ్యర్థి మోపిదేవి అశోక పావని, చైర్మన్ అభ్యర్థి పీతా గోపిచంద్ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాడిగడప మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారానికి ప్రజల నుంచి లభించిన స్పందనతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.