BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి

Select Suryaa Now
బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి

 

- బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి
- కూటమి అభ్యర్థి ఒక్కరే.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆనందరావు
- కత్తెర గుర్తుపై ఓటు వేసి శ్రీవాణిని గెలిపించాలి
- రెబల్ అభ్యర్థులకు కూటమి మద్దతు లేదు: మెట్ల రమణబాబు 

అమలాపురం మేజర్ న్యూస్

బెండమూర్లంక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల దొరబాబు సతీమణి యాళ్ల శ్రీవాణిని కూటమి అధికారిక అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు.

అల్లవరం మండలంలో సర్పంచ్ పదవిని బీజేపీకి కేటాయించామని, కూటమి తరఫున యాళ్ల శ్రీవాణి ఒక్కరే అధికారిక అభ్యర్థి అని తెలిపారు. ఆమె ఎన్నికల గుర్తు కత్తెర అని, ఆ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కూటమి తరఫున మరొక అభ్యర్థి ఎవరూ లేరని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జడ్పీటీసీ గుర్రం కృష్ణ (జీకే) మాట్లాడుతూ.. శ్రీవాణి విజయానికి తామంతా సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు.

టీడీపీ రాష్ట్ర నాయకులు మెట్ల రమణబాబు మాట్లాడుతూ.. కూటమి అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని కోరారు. రెబల్ అభ్యర్థులను రెబల్ అభ్యర్థులుగానే పరిగణిస్తామని, కూటమి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మెట్ల సత్య, యాళ్ల సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు.