పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
పాములపాడు: మండల కేంద్రంలో డీజే శబ్దాల హోరు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి నిరంతరంగా పాటలు ప్లే చేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
శబ్ద తీవ్రతపై నియంత్రణ లేకుండా డీజేలు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధిక శబ్దాల వల్ల ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు స్పందించి డీజే శబ్దాలపై నియంత్రణ విధించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పాములపాడు ప్రజలు కోరుతున్నారు.