BREAKING
జగ్గయ్యపేటకు గర్వకారణం ఉమామహేశ్వరరావుకు అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పల్లెనిద్ర. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం. ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక

జగ్గయ్యపేటకు గర్వకారణం ఉమామహేశ్వరరావుకు అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు

Select Suryaa Now
జగ్గయ్యపేటకు గర్వకారణం ఉమామహేశ్వరరావుకు అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు

జగ్గయ్యపేటకు గర్వకారణం ఉమామహేశ్వరరావుకు అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-, నవంబర్ 21: జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్న స్వయం శక్తి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అండ్ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ సామాజిక సేవకులు వడ్డేపూడి ఉమామహేశ్వరరావు కి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు లభించింది

హైదరాబాద్ లో కళానిలయం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు అందజేశారు. స్వయం శక్తి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అండ్ అభివృద్ధి సంఘం ద్వారా దివ్యాంగుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేస్తున్న నిరంతర సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ,ఈ అవార్డు నాది కాదు, నా దివ్యాంగ సోదర, సోదరీమణులది. కలామ్ గారి ఆశయాలతో ముందుకు వెళ్తూ, ఇక ముందు కూడా మా సంఘం ద్వారా దివ్యాంగుల సేవలోనే కొనసాగుతా అని తెలిపారు

అలాగే ఆయన జగ్గయ్యపేట చుట్టుపక్కల ఉన్న సిమెంట్ ఇండస్ట్రీస్, కెమికల్ పరిశ్రమలు, పారామౌంట్, ఆటోనగర్ పరిశ్రమల యాజమాన్యాలకు ఒక విజ్ఞప్తి చేశారు. "మా ప్రాంతంలో ఉన్న అన్ని పరిశ్రమలు దివ్యాంగులను కూడా గుర్తించాలి. మాకు జాలి వద్దు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము కూడా పని చేయగలం. మా దివ్యాంగులకు మీ పరిశ్రమలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము అని ఆయన కోరారు.

ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీ వారు వారి సి.ఎస్.ఆర్. నిధులలో కనీసం 2% ఖర్చు చేస్తే చాలు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న 15 వేల మంది దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయి అని ఆయన అన్నారు.

ఆయనకు అవార్డు రావడం పట్ల జగ్గయ్యపేట ప్రజలు, దివ్యాంగ సంఘాల నాయకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా