BREAKING
స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పల్లెనిద్ర. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం. ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం

స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పల్లెనిద్ర. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం.

Select Suryaa Now
స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పల్లెనిద్ర.   ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం.

 

అనకాపల్లి, నవంబర్ 22, మేజర్ న్యూస్: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు సూచనలతో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అనకాపల్లి రూరల్ పోలీసులు మండలంలోని మారేడిపూడి, అక్కిరెడ్డిపాలెం గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కార్యక్రమం శనివారం రాత్రి చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం సెక్షన్ 144 సిఆర్పిసి, 30 పోలీస్ యాక్ట్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నాయని, కావున ప్రజలందరూ ఆంక్షలను, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో యువత, గ్రామస్తులు సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలకు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సాధారణ సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో జరిగే గొడవలపై కఠిన చర్యలు ఉంటాయని, నిందితులపై రౌడీషీట్లు తెరవడం, బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏవైనా సందేహాలు వస్తే వెంటనే పోలింగ్ అధికారులకు లేదా పోలీసులకు తెలియజేయాలని, వాట్సాప్ గ్రూపుల్లో అవాస్తవాలు, అపోహలు ప్రచారం చేసి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కేసుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు క్యారెక్టర్ సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులు వస్తాయని, జీవితాలు నాశనమవుతాయని యువతకు అవగాహన కల్పించారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో చాలామంది పైన సత్ప్రవర్తనగా మెలుగుటకు బైండోవర్ కేసులు పెట్టబడ్డాయి. బైండ్ ఓవర్ సంతకాలు చేసిన వ్యక్తులు ఏవైనా అల్లర్లు, గొడవలు సృష్టించిన, గొడవలలో పాల్గొన్న లేదా ఎటువంటి కేసు నమోదు అయిన వారు చట్టపరమైన కేసుతోపాటు వారిపై బైండ్ చేసిన లక్ష రూపాయలను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి దగ్గర సదరు లక్ష రూపాయలను కట్టవలసి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సమయంలో కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరూ గుమిగూడ వద్దని, ఓటు వేసాక ఇళ్ళకి వెళ్లాలని, వీధుల్లో గుంపులుగా తిరగరాదని, విజయోత్సవ ర్యాలీలు చెయ్యరాదని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సిఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, హెచ్ సి వి. గోవింద్, కానిస్టేబుల్ హరీష్ పాల్గొన్నారు.

రిపోర్టర్ : నాగు యన్నంశెట్టి, అనకాపల్లి.