సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
ప్యాపిలి మేజర్ న్యూస్: మండలంలోని కలచట్ల, పోతుదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. కలచట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోతిరెడ్డి కోటేశ్వరమ్మ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. పోతుదొడ్డి సర్పంచ్ అభ్యర్థిగా వైకాపా తరఫున జి.భార్గవ్ యాదవ్ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కలచట్ల, పోతుదొడ్డి, మాదినేనిదొడ్డి గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.