BREAKING
పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదు - పోలియో రహిత సమాజమే లక్ష్యం జగ్గయ్యపేటకు గర్వకారణం ఉమామహేశ్వరరావుకు అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పల్లెనిద్ర. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం. ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు

పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

Select Suryaa Now
పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ  స్నేహ మెహ్ర

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:చలికాలం నేపథ్యంలో ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు.ముఖ్యంగా జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, గ్రామీణ రహదారులపై ప్రయాణించే వాహనదారులు వేగాన్ని తగ్గించి, తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాల హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా వినియోగించాలని, ముందు వెళ్తున్న వాహనానికి తగిన దూరం పాటించాలని సూచించారు. అనవసరంగా ఓవర్‌టేక్ చేయడం, వేగంగా ప్రయాణించడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనాలను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నిలిపివేయకుండా, అత్యవసర పరిస్థితుల్లో పార్కింగ్ లైట్లు లేదా హజార్డ్ లైట్లు వినియోగించాలని తెలిపారు.ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రయాణించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని, అప్రమత్తతతో ప్రయాణించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.