BREAKING
బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదు - పోలియో రహిత సమాజమే లక్ష్యం జగ్గయ్యపేటకు గర్వకారణం ఉమామహేశ్వరరావుకు అంతర్జాతీయ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అవార్డు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు స్థానిక పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో పల్లెనిద్ర. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమం. ఎల్లార్తి గ్రామ అభివృద్ధికి పాటుపడుతా ఆదరించి గెలిపించండి పాములపాడులో డీజే శబ్దాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు చిన్నారులు, వృద్ధుల అవస్థలు.. శబ్ద నియంత్రణలో పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కేంద్ర మంత్రి ఘన సన్మానం ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ -హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు: డీఈఓ

10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Select Suryaa Now
10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ప్రొద్దుటూరు క్రైం నవంబర్ 22 మేజర్ న్యూస్:
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ కో-ఎడ్యుకేషన్ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై గణిత ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆగస్టు 13వ తేదీన ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో విద్యార్థినిని స్టాఫ్ రూమ్‌కు రావాలని ఉపాధ్యాయుడు పిలిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తరగతులు ఉండటంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి స్టాఫ్ రూమ్ వద్దకు వెళ్లగా ఉపాధ్యాయుడు నిద్రపోతుండటంతో తిరిగి తరగతి గదికి వెళ్లినట్లు తెలిపింది.
అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరోసారి స్నేహితురాలితో కలిసి ఉపాధ్యాయుడి వద్దకు వెళ్లగా, తన స్నేహితురాలిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి, విద్యార్థినితో దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఆమె చేయి పట్టుకుని, వెనుకవైపు తాకడంతో పాటు ముందువైపు అసభ్యంగా తాకి కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపించింది. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని ఉపాధ్యాయుడిని నెట్టివేసి అక్కడి నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ, అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయుడి ఫోన్ ద్వారా తన పిన్నికి సమాచారం అందించినట్లు తెలిపింది. వెంటనే పాఠశాల వద్దకు చేరుకున్న పిన్ని విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం బంధువులతో చర్చించి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
విద్యార్థినికి జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనపై మరో బాలికకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 222/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్ 75తో పాటు పోక్సో చట్టం 2012లోని సెక్షన్ 9 రెడ్‌విత్ 10 ప్రకారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జి. మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.