రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ
రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థి అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ లభిస్తుంది. ఆదివారం రాచానుపల్లి గ్రామంలో.. వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగించారు. ఎన్నికల గుర్తులు కేటాయించిన మంచం గుర్తుకు, వార్డు సభ్యుల అభ్యర్థుల గుర్తులకు ఓట్లు వేసి గెలిపించాలని.. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో సర్పంచ్ గా రాచానుపల్లి అభివృద్ధికి.. శక్తి వంచన లేకుండా.. సొంత డబ్బులు వెచ్చించి పనిచేశానని తెలిపారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా ప్రజలకు తాగునీరు అందించానని, కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, మట్టి రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించానని తెలిపారు. పంచాయతీలో గత వైసిపి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి.. సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేశానని తెలిపారు. గత ఐదేళ్లలో తను చేసిన అభివృద్ధిని గుర్తించి.. తనకు మరోసారి సర్పంచిగా అవకాశం ఇచ్చి గెలిపించాలని.. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాచాను పల్లి గ్రామపంచాయతీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.