BREAKING
క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక ‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..) సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు! 107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకూడదు - పోలియో రహిత సమాజమే లక్ష్యం

బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ

Select Suryaa Now
బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ

 

 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బైరెడ్డిపల్లి మండలంలోని 21 సర్పంచ్‌ స్థానాలకు 46 మంది, 172 వార్డు సభ్యుల స్థానాలకు 344 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, ఎంపీడీఓ కె. ఆనంద బాబు తెలిపారు. మొత్తం 216 వార్డుల్లో 44వార్డులు ఏకగ్రీవమయ్యాయని, సర్పంచ్‌ స్థానాలన్నింటికీ పోటీ జరుగుతుందని వెల్లడించారు.జీపీ వారీగా సర్పంచ్‌ అభ్యర్థుల వివరాలు: ఆలపల్లిలో వి. నాగవేణి, కె. రాజమ్మ; గోళ్లచీమనపల్లిలో కె. కిశోర్‌, సి. రెడ్డప్పరెడ్డి; లక్కనపల్లిలో ఆర్‌. అమరావతి, పి.ఆర్‌. ఉమ, కె. విజయమ్మ; పెద్దచెల్లారగుంటలో వి. కవిత, జి. సువర్ణరెడ్డి; ఖంభంపల్లిలో ఎం. కోదండరెడ్డి, పి.ఆర్‌. హరికుమార్‌ పోటీలో ఉన్నారు.ఎం.కొత్తూరులో పి. కుప్పస్వామి, నీలయ్య; దేవదొడ్డిలో కె. అమరావతి, జె. చలపతి; బైరెడ్డిపల్లిలో పి.వి. భువనచంద్ర గౌడు, ఎం.కె. రెడ్డి వీనస్‌; గడ్డూరులో వసంతమ్మ, వెంకటమ్మ, ఎం. శోభ; తీర్థంలో గోవిందస్వామి, జ్యోతి బరిలో ఉన్నారు.బేలుపల్లిలో టి. కాంతమ్మ, ఎస్‌. గౌరమ్మ; చప్పిడిపల్లిలో పార్వతమ్మ, సి. రాజేశ్వరి; ధర్మపురిలో వి. నిహారిక, ఎం. భానుప్రియ; కమ్మనపల్లిలో కె. నాగరత్న, సి. భాగ్యమ్మ అలియాస్‌ సి. భాగ్యలక్ష్మి; నెల్లిపట్లలో ఎస్‌. భాగ్యవతి అలియాస్‌ భాగ్యవతి సౌందరాజన్‌, సి. భువనేశ్వరి, డి. రూప, ఎం. సరస్వతి పోటీ చేస్తున్నారు.గంగినాయనిపల్లిలో పి. చలపతి, ఎస్‌. వెంకటేశు; గౌనితిమ్మేపల్లిలో ఎం. లక్ష్మీనారాయణ, జి. వెంకటేశు; కడపనత్తంలో జె. కృష్ణప్ప, పి. సుబ్బారెడ్డి; పాతపేటలో జి. రాజశేఖర్‌రెడ్డి, డి. రాజేంద్ర; పాతూరునత్తంలో కె. రత్నమ్మ, డి. వెంకటమ్మ; వెంగంవారిపల్లిలో బి. రమేష్‌, కె. లవకుమార్‌ బరిలో ఉన్నారు.వార్డు సభ్యుల పోటీ వివరాలు: బైరెడ్డిపల్లిలో 14 వార్డులకు 28 మంది; లక్కనపల్లి, నెల్లిపట్లలో 12 వార్డులకు 24 మంది చొప్పున; ఖంభంపల్లి, దేవదొడ్డి, తీర్థం, ధర్మపురి, కమ్మనపల్లి, కడపనత్తం, పాతపేట, వెంగంవారిపల్లిలో 10 వార్డులకు 20 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఎం.కొత్తూరులో 9 వార్డులకు 18 మంది; ఆలపల్లి, గౌనితిమ్మేపల్లి, పాతూరునత్తంలో 8 వార్డులకు 16 మంది చొప్పున; గోళ్లచీమనపల్లి, బేలుపల్లి, గంగినాయనిపల్లిలో 7 వార్డులకు 14 మంది చొప్పున బరిలో ఉన్నారు.ఏకగ్రీవ వార్డుల వివరాలు: పెద్దచెల్లారగుంట, గడ్డూరు, చప్పిడిపల్లి గ్రామ పంచాయతీల్లోని మొత్తం పది వార్డులు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. బేలుపల్లిలో 2, 5, 8, 10, 12; గోళ్లచీమనపల్లిలో 5, 6, 8; గంగినాయనిపల్లిలో 3, 9, 10; ఆలపల్లిలో 5, 6; ఎం.కొత్తూరులో 10వ వార్డు ఏకగ్రీవమయ్యాయి.అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ప్రశాంతంగా ప్రచారం నిర్వహించాలని ఆనంద బాబు కోరారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకుని, గ్రామాభివృద్ధికి కృషిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.