BREAKING
నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక ‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..) సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు! 107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక

Select Suryaa Now
యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక

 

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేయాలి: ఎమ్మెల్యే కుంభం

యాదాద్రి:యాదవ సమాజ ఐక్యతను చాటుతూ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు సదర్ సమ్మేళనాలు దోహదపడతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరూ కుల, ప్రాంత భేదాలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక ఐక్యతతోపాటు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలను కాపాడుకుంటూనే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా కమిటీ సభ్యులు, యాదవ సోదరులు పాల్గొన్నారు.