BREAKING
నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక ‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..) సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు! 107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..)

Select Suryaa Now
‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.…  ‎(ఆథ్యాత్మిక వ్యాసం..)

‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.…

‎(ఆథ్యాత్మిక వ్యాసం..)

‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు

‎సెల్ ::--8247433432

‎కార్తికం... ఏటికేడాదీ ఎదురుచూసే శివభక్తులకు

‎ఓ అపురూప మాసం

‎దీక్షాధారులకు ఓ మహిమాన్వితం…

‎అయిన ఈ కార్తికంలో

‎ఆ పరమేశ్వరుని ఏ రూపంలో కొలిచినా

‎నవ విధ భక్తి మార్గాలలో ఏ విధంగా అర్చించినా

‎వేద మంత్రాలతో గల అభిషేక అర్చనా విధానాలు ఏమీ చేయలేకపోయినా శివ శివా  నీదే భారమంటూ ముక్కంటిని త్రికరణ శుద్ధిగా ఓం నమశ్శివాయ నామం జపిస్తే ఆ శివయ్యే నీ వెన్నంటి కంటికి రెప్పలా కాపాడతాడు.

‎ఈ కార్తికంలో శివయ్య గురించి, శివ లీలలు గురించి, శివ భక్తుల గురించి తెలుసుకోవడం అత్యంత అవశ్యనీయం.

‎ఈ సందర్భంగా శివుని యందు అత్యంత భక్తి శ్రద్ధలు కనబరచి జీవితాంతం శివ భక్తుడిగా గడిపిన మహాకవి 'ధూర్జటి'ని గురించి కొద్దిగా, ఆయన 'రాసిన 'శ్రీ కాళహస్తీశ్వర శతకం' గురించి. "గా తెలుసుకుందాం .

‎'నిను సేవింపగ నాపదల్వొడమనీ

‎                      నిత్యోత్సవంబబ్బనీ

‎జనమాత్రుండననీ, మహాత్ముడననీ

‎                       సంసార మోహంబు పై

‎కొననీ, జ్ఞానము గల్గనీ గ్రహగతుల్

‎                        కుందింపనీ, మేలు వ

‎చ్చిన రానీ యవి నాకు భూషణములే                    

‎                            శ్రీ కాళహస్తీశ్వరా"

‎‎అంటూ జీవితాంతం పరమేశ్వరుని పూజిస్తూ, సేవిస్తూ,  తరించిన శివభక్తి తత్పరుడు మహాకవి ధూర్జటి 1480-1530 మధ్య కాలంలో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఒక కవిగా జీవించాడని చరిత్రకారులు చెబుతున్నారు.

‎‎సంస్కృత భాషలో గల స్కాంద పురాణంలో శివ రహస్య ఖండంలోని చిన్న కథను తీసుకొని తనదైన శైలిలో అనేక వర్ణనలు గావిస్తూ శ్రీ కాళహస్తి మాహాత్మ్యం తెలుగులో రాసి  శ్రీ కాళహస్తీశ్వరునికి అంకితమిచ్చిన ధూర్జటి మహా కవి శివ భక్తుడు. శివుని వలె పొడవైన జటలు (జుట్టు) కలిగి ఉన్నాడు కావున 'ధూః+జటి'- 'ధూర్జటి' అని పేరు పొందెనని చరిత్రకారుల అభిప్రాయం.

‎‎'అంతా మిధ్య తలంచి చూచిన

‎                  నరుండట్లౌటెరింగిన్

‎సదా కాంత ల్పుత్రులు నర్దముల్ తనువు

‎                 నిక్కంబంచు మోహార్ణవ

‎భ్రాంతింజెంది చరించుగాని,

‎               పరమార్థంబైన నీయందు దా

‎చింతాకంతయు చింత నిల్పడు కదా!

‎                          శ్రీ కాళహస్తీశ్వరా"

‎‎అంటూ తాత్కాలికమైన జీవితం భ్రాంతి అని తెలిసి కూడా భార్యాపిల్లలు అంటూ వెంపర్లాడుతున్నారే కాని శాశ్వతంబైన, పరమార్ధమైన ఆ పరమేశ్వరుని యందు దృష్టి నిలపట్లేదు అంటూ వ్యధతో, ఆర్తితో, నిజమైన భక్తితో, ప్రతీ అక్షరాన్ని శివాభిషేకం చేసి పాలలో ముంచి తీసినట్లుగా అందరికీ అర్ధమయ్యే సులభ శైలిలో 'శ్రీ కాళహస్తీశ్వర శతకం' రచించాడు. మహాశివభక్తుడైన ధూర్జటి రాసిన రెండవ కృతి ఇది. ఇందులో 116 పద్యాలున్నాయి. ఒక్కో పద్యంలో ఎన్నో పురాణ కథలు, మానవ జీవితంలో పాటించాల్సిన ఎన్నో నీతి విషయాలు, ఆధ్యాత్మిక భక్తి భావతరంగాలు... ఎన్నో ఉదాహరణల రూపంలో అందరికీ అర్ధమయ్యే రీతిలో ఉన్నాయి.

‎‎ఆ పార్వతీపతి, భోళాశంకరుడు, ఉబ్బులింగడు, కోరిన వారికి వరాలిచ్చే దేవుడు, హాలాహాలాన్ని కంఠంలోనే దాచి పెట్టి లోకాలను రక్షించిన

‎భక్త వశంకరుడు అయిన శివుణ్ణి ఏ రూపంలో పూజించాలి, సేవించాలి అంటూ

‎

'నిన్నే రూపముగా భజింతు మదిలో

‎         నీ రూపు మోకాలో స్త్రీ

‎చన్నో, కుంచమో, మేక పెంటియో,

‎          యీ సందేహముల్మాన్పి ని

‎కన్నారన్భవదీయమూర్తి

‎        సగుణాకారంబుగా జూపవే

‎చిన్నీరేజ విహార మత్త మధుపా

‎                       శ్రీ కాళహస్తీశ్వరా'

‎

‎ఓ పరమశివా! నిన్ను మోకాలి చిప్ప రూపంలో,

‎స్త్రీ యొక్క స్థన్యములోను, ధాన్యము కొలిచే కుంచము రూపములోను, మేక పెంటిక రూపములోను... ఏ రూపంలో

‎కొలవాలి, పూజించాలి... ఓహో!

‎నీవు భక్త వశంకరుడువు కదా! ఏ రూపంలో  కొలిచినా భక్తుల వశమవుతావు కదా...! అంటూ మనసు నిండా శివుడినే నిలుపు కొంటూ, లేదా శివుడినే ధ్యానించుకోవడం వలన మన కంటికి కనిపించేవన్ని శివ రూపాలుగానే సాక్షాత్కరిస్తాయి.

‎ఆరాధనీయాలవుతాయి అంటూ  చెబుతూ

‎

‎'నీకుం గాని కవిత్వమెవ్వరికి నే నీనంచు

‎                                              మీదెత్తితిన్

‎చేకొంటిన్ బిరుదంబు కంకణము

‎                         ముంజేగట్టితిం బట్టితిన్

‎లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు

‎          కీడుల్ నేర్పులుం గావు ఛీ

‎ఛీ కాలంబు రీతి దప్పెడు జుమీ

‎                   శ్రీ కాళహస్తీశ్వరా..."

‎ఓ పరమేశ్వరా! నేను నా కవిత్వము నీ పైనవే చెప్పెదను. ఇతరులపై ఏ మాత్రము చెప్పనని ప్రతిజ్ఞ చేసితిని, అందుకు దీక్షాబద్దుడనైతిని, ప్రజలు మెచ్చుకొనునట్లుగా ఆ నియమము 'పాటించుచున్నానని చెబుతూ మహాకవి

‎ధూర్జటీ ఈ మానవులు అనిత్యమైన జీవితంలో తాత్కాలికమైన ఆస్తిపాస్తులు భార్యా పిల్లలపై మోహం పెంచుకొనుటను చూచి జాలిపడుతూ

‎

‎"కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్

‎                       జీవన భ్రాంతులై

‎కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున

‎           కనేకుల్, వారిచే నే గతుల్

‎పడసెన్? పుత్రులు లేని యా

‎          శుకునకువ్ వాటిల్లెనే దుర్గతుల్

‎చెడునే మోక్ష పదం బపుత్రకునకున్

‎             శ్రీ కాళహస్తీశ్వరా..."

‎

‎పిల్లలు పుట్టలేదని చాలా మంది బాధ పడుతుంటారు. పిల్లలే సర్వస్వం అంటూ పిలలు లేనివారికి మోక్షం రాదంటూ ఎంతో మంది బాధ పడుతుంటారు.

‎వంద మంది పుత్రులున్న ధృతరాష్ట్రునికి ఏ గతి వచ్చినది? పుత్రులు లేని శుక మహర్షికి పుణ్యగతులు కలగలేదా..? అని చెప్పుచూ మనకు పుణ్యగతులు కలగటానికి, కలగక పోవటానికి పిల్లలు కాదు కారణం మనం ఆ పరమేశ్వరుని పూజించటమే, ఆయన యందు మనసును లగ్నం చెయ్యటమే కారణమంటూ

‎ఇంక ఈ లోకం పోకడ గురించి

‎

‎'ఒకరిం జంపి పదస్థులై బ్రతుక

‎    తామొక్కొక్క రూహింతురే

‎లకొ తామెన్నడు జావరో తమకు బోవో

‎               సంపదల్ పుత్ర మి

‎త్ర కళత్రాదుల తోడ నిత్య సుఖ మందం

‎                     గం యుందురో యున్న వా

‎రికి లేదో మృతి యెన్నడుం గటకటా!    

‎                              శ్రీ కాళహస్తీశ్వరా..."

‎

‎మానవులు ఎంత అమాయకులు తాము ఒక్కరే శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటామని భావించుకొంటూ పదవులకై ప్రాకులాడుతూ, ఆస్తులను పెంచుకోటానికి ఇతరులను చంపుతుంటారు. ఇతరులను బాధిస్తుంటారు.... ఏనాటికైనా ప్రతీవాడు. మరణిస్తాడనే సత్యం ఎప్పటికి తెలుసుకుంటారో, ఓ పరమేశ్వరా..! వారికి కనువిప్పు

‎కలిగించవయ్యా... అంటూ అమాయక ప్రజల తరపున పరమ శివుడిని వేడుకున్న ధూర్జటి

‎

‎'ఘడియల్ రెంటికొ మూటికొ

‎               ఘడియల్ కాదేని నేడెల్లి యో

‎కడ నేడాదికోయెన్నడో ఎరుగమీ

‎                  కాయంబు లీ భూమిపై

‎బడగా నున్నవి, ధర్మమార్ధ మొకటిం

‎                  బాటింపరీ మానవుల్

‎చెడుగుల్ నీ పద భక్తియుం దెలియురో   

‎                       శ్రీ కాళహస్తీశ్వరా..."

‎

‎ఒకటి రెండు ఘడియలకో, ఈరోజో, రేపో, మాపో సంవత్సరానికో, కొంత కాలానికో, ఎప్పుడో ఒకప్పుడు జీవి మరణించిక మానడు. మూర్ఖులైన వారికి జ్ఞానోదయం కలిగించు తండ్రీ, నీయందు భక్తి

‎నిలిచేటట్లు చేయుము తండ్రీ అంటూనే

‎ 

‎"ఏ వేదంబు పఠించే లూత, భుజగం

‎                బే శాస్త్రముల్సూచె, దా

‎నే విద్యాభ్యసనం బోనర్చె గరి, చెంచే

‎        మంత్ర మూహించె, బో

‎ధావిర్భావ నిధానముల్

‎          చదువులయ్యా? కావు, మీ పాదసం

‎సేవాసక్తియె కాక జంతుతతికిన్

‎                     శ్రీ కాళహస్తీశ్వరా..."

‎

‎వేదాలు పఠించనవసరం లేదు. ఏ శాస్త్రాలు చూడనవసరం లేదు. ఎట్లాంటి విద్యాభ్యాసనం లేకుండానే జంతు సమూహానికి చెందిన సాలె పురుగు, సర్పము, ఏనుగు, అటవీ ప్రాంతానికి చెందిన బోయవాడైన తిన్నడు ఇలాంటి వారందరూ మోక్షం పొందారు అంటే కేవలము నీ యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి నిన్ను సదా పూజించటం వల్లనే కదా..!

‎అని చెబుతూనే 'భక్తి ప్రధానం' అనే విషయాన్ని చెప్పారు.

‎

‎సమస్తమూ శివుడే. సర్వస్వము శివునికే.

‎ఈ జీవితం ఉన్నది శివార్చనకే అనుకొంటూ

‎

‎'ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహా బంధనం బేలా నా మెడ గట్టినాడవు'.. అంటూ శివుని ప్రశ్నిస్తూ 'అలంచున్మెడ గట్టి, దానికి నపత్య శ్రేణి కల్పించి, తద్పాల వ్రాతమునిచ్చి పుచ్చుకోను సంబంధంబు గావించి... అంటూ సంసార సాగరంలో పూర్తిగా ముంచి వేస్తున్నావా? ఓ పరమేశ్వరా! అని దీనంగా వేడుకున్నాడు.

‎

‎"నిన్నున్నమ్మిన రీతి నమ్మ నొరులన్

‎            నీకన్న నాకెన్న లే

‎రన్నల్దమ్ములు, తల్లిదండ్రులు గురుం

‎               డాపత్సహాయుండు, నా

‎యన్నా యెన్నడు నన్ను సంస్రుతి

‎                విషాదాంబోధి దాటించి య

‎చ్చిన్నానంద సుఖాబ్ధి దేల్చెదో కదే

‎                          శ్రీ కాళహస్తీశ్వరా!"

‎ఓ పరమేశ్వరా! నిన్ను నమ్మిన విధముగా వేరెవ్వరినీ నమ్మను. నాకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, గురువు, మిత్రుడు ఎవ్వరునూ లేరు. నన్ను సంసార

‎సముద్రమును దాటించి  ఆనందం అనే సముద్రం లో

‎ముక్తి అనే మోక్షాన్ని ప్రసాదించు తండ్రీ"

‎అంటూ తనకే కాక ఇతరులకు కూడా ముక్తి మార్గాన్ని  ప్రసాదించేలా అందించిన

‎శివానుగ్రహంతో కూడిన దివ్య ప్రసాదం ఈ పద్యం. మన తెలుగు  వారందరికీ పుణ్యమార్గాన్ని అందించే

‎రచన చేసిన ధూర్జటి మన తెలుగు జాతి నిండు వెలుగుల శివభక్తుడు.

‎ఈ కార్తికాన ఆ బోళా శంకరుడిని, భక్తవశంకరుడిని, ప్రసన్నం చేసుకోవటానికి ఆ ముక్కంటి అనుగ్రహం పొందడానికి

‎"శివశివా..! మహాదేవా...!

‎నీవే నా సర్వం, నీవే నా వరం

‎నీవే నా బలం, నా బలగం

‎నీవిచ్చిన బ్రతుకు నీకే అంకితం

‎శివా! ఆదుకోవా!.... నన్నాదుకోవా!"

‎అంటూ హరుడిని ప్రార్థిస్తూ

‎భోగభాగ్యాలతో శివానుగ్రహపాత్రులు అవుదాం.…

‎

‎రచన-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు

‎సెల్ ::--8247433432

‎