BREAKING
స్పేస్‌ఎక్స్‌కు 4,400 కోట్ల డాలర్ల చిప్‌ల కొనుగోలు రుణ సమీకరణ. జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌కు అనుకూలంగా బీవైడీ వాహనంపై నెదర్లాండ్స్‌ న్యాయస్థానం తాత్కాలిక నిషేధం. అమెరికా కేంద్ర బ్యాంకు అధికారి వడ్డీ రేట్ల పెంపునకు మద్దతు.. విదేశాల్లో సమాచార కేంద్రాలు నిర్మించే అమెరికా సంస్థలపై భారీ పన్ను విధిస్తామని ట్రంప్‌ హెచ్చరిక. హీరేహాళ్ లో సింగాడి మంజునాథ్ విస్తృత ప్రచారం.… అమెరికా–చైనా మధ్య చిప్‌ల విక్రయ విధానంపై ట్రంప్‌ కొత్త ప్రకటన. డెన్మార్క్‌లో రష్యా నిఘా సంస్థలపై హత్య కుట్ర ఆరోపణలు, రష్యా రక్షణ ప్రతినిధి బహిష్కరణ. చైనా–ఆస్ట్రేలియా సంయుక్త విద్యుదీకరణ లక్ష్యం.. 2035 నాటికి ప్రపంచ ఇంధన వినియోగంలో విద్యుత్ వాటా 35 శాతానికి పెంపు! చౌడవరంలో ఐ డి సి చైర్మన్ మువ్వా పర్యటన కళ్యాణదుర్గం పట్టణంలో కస్తూరిబా య్ హాస్టల్ లో తనిఖీ చేసిన వైద్య అధికారి. ‎మంచి మాటే... కంచు కోట... ‎( సామాజికం ) ఊలపాడు పంచాయతీ సర్పంచ్ బరిలో భూపాల్ రాజు : కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ నేటి నుండి బోగడగూడ చర్చిలో క్రీస్తు రాజు పండుగ మహోత్సవాలు జెడ్పి ఛైర్మన్,మంత్రి మండిపల్లిని కలిసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర

‎మంచి మాటే... కంచు కోట... ‎( సామాజికం )

Select Suryaa Now
‎మంచి మాటే... కంచు కోట... ‎( సామాజికం )

మంచి మాటే... కంచు కోట...
‎( సామాజికం )
‎
‎రచన ::-- అక్షర  కిరీటి తెన్నేటి మాస్టారు
‎సెల్ ::-- 8247433432
‎
‎అన్ని జీవరాశులల్లో ఉత్తమమైనది మానవ జన్మ ఇతర ప్రాణులకు లేని ప్రత్యేకతలు మానవ జన్మకు ఉన్నాయి కాబట్టే మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్పవచ్చు. మనసు, మెదడు, జ్ఞానం, మాట ఇట్లా
‎కొన్ని ప్రత్యేకతలున్నాయి. వాటిలో మాట గురించి కొద్దిగా తెలుసుకుందాం
‎
‎తమ భావాలను ఇతరులకు తెలియ చెప్పటానికి ఉపయోగపడేది భాష, భాష అనేది భావ ప్రకటనకు, భావ వ్యక్తీకరణకు ఉపకరించు వాహిక అని చెప్పవచ్చు. అటువంటి భాషకు మూలం మాట, శబ్దాల కలయిక, అక్షరాల కలయికనే మాట
‎అనవచ్చు. ప్రస్తుత కాలంలో 'మాట' అనే దానికి ఎంతో విలువ, ప్రాధాన్యత ఉంది. అదే విధంగా 'మాట' అనే దానిని చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు.
‎ఓ మంచి మాట అని, నీతో ఓ మాట అని, చిన్నమాట అని, ఇదోగో ఓ మాట అని ఇలా పలురకాలుగా వ్యవహరిస్తుంటారు. పలు అర్ధాల్లో, పలు సందర్భాల్లో మాటను వాడుతుంటారు.
‎
‎చెడు మాట్లాడినా, మంచి మాట్లాడినా మాటలే కదా. మంచి మాట్లాడేవారికి ఎక్కువ స్నేహం, విలువ, గౌరవం, హోదా లభించటం సహజం. అందుకనే ప్రియం గా, హితంగా, చక్కగా, చల్లగా, మంచిగా మాట్లాడండి. పది మంది స్నేహితులను పొందండి అని చెబుతుంటారు. ఈ సమాజంలో అందమైన ఆభరణాలు, పరిమళాలనిచ్చే సుగంధ ద్రవ్యాలు మొదలైనవి ఏవీ ఆభణాలు, అలంకారాలు కావు అంటూ 'వాగ్భూషణమ్ భూషణమ్' అని సంస్కృతంలో భౌతికంగా, కృత్రిమంగా
‎కల ఆభరణాలు, అలంకారాలు అన్ని నశించి పోతాయి కానీ, 'వాక్ భూషణమే' మాట అనే ఆభరణం శాశ్వతంగా నిలిచిపోయే ఆభరణం అంటూ భర్తృహరి చెప్పాడు. కాబట్టి మంచి మాటలే మాట్లాడదాం....
‎
‎'మాటకు మాట తేగులు, నీటికి నాచు తెగులు' అని మన పెద్దలు అంటుంటారు. అంటే అవతలివారు ఏదైనా పరుషంగా మాట్లాడుతుంటే నోరు మూసుకొని ఉండాలి. మాటకు మాట బదులిచ్చినట్లయితే ఇంకా గొడవ పెరుగుతుంది కానీ తగ్గదు కదా.
‎"నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది' అని కూడా అన్నారు పెద్దలు. మన నోరు మంచిదవ్వాలి అంటే మనం ఎవరినీ పరుషంగా, కఠినంగా మాట్లాడ కుండా ఉంటే అందరితో స్నేహంగా మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతుంటే ప్రతి ఊరు మంచిగానే ఉంటుంది అని అర్ధం.
‎అట్లాగే 'నోరా వీపుకు తేకు' అని కూడా అన్నారు. ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చినట్టల్లా అందరినీ కఠినంగా, పరుషంగా మాట్లాడుతూ, దూషిస్తూ ఉంటే వీపుకు, శరీరానికి దెబ్బలు తప్పవు. అందుకనే 'నోరా... వీపుకు తేకు... ' అని అంటుంటారు.
‎కాబట్టి మంచిగా మాట్లాడుతుండాలి.
‎
‎'వాక్కు చేత తప్పు వావులు వరుసలు
‎వాక్కుచేత తప్పు వనిత గుణము
‎వాక్కు చేత గల్గు వర కర్మములు భువి
‎విశ్వదాభిరామ వినురవేమ' అని అంటాడు వేమన.
‎
‎అంటే మాటలు పరుషంగా, కఠినంగా ఉంటే బంధుత్వాలు చెడిపోతాయి. స్త్రీలకు చెడ్డ పేరు వస్తుంది. సత్కార్యాలు, మంచి పనులు చెయ్యాలంటే మంచి మాటలే ఉండాలి అని వేమన చెప్పారు. కాబట్టి మంచిగా మాట్లాడాలి. మంచి పనులు చెయ్యాలి ఇంకా ఏం చెప్పారంటే.
‎
‎'పడుచుమాట వాడి పరితపింపగనేల?
‎వెడగు చర్యలడచి వేడి గురుని
‎యడుగులంటి మ్రొక్కి యాసను విడద్రొక్కు
‎విశ్వదాభిరామ వినురవేమ!'
‎
‎మొదట దుందుడుకుగా, కోపంగా, పరుషంగా మాట్లాడి ఆ తర్వాత విచారించటం కంటే ముందుగానే తెలివిగా, మంచిగా మాట్లాడి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ విధంగా గురువును వేడుకొంటూ ముక్తిని ప్రసాదించమని కోరుకోవాలంటాడు వేమన,
‎
‎చాలామందికి అదో రకమైన అహంకారం, గర్వం, పొగరు ఉంటాయి. బాగా ఛదువుకున్నాం కదా. జ్ఞానవంతులం, తెలివైనవారం అని పొగరుగా, గర్వంగా ప్రవర్తిస్తుంటారు.
‎అటువంటి వాళ్ళను గురించి భర్తృహరి ఇట్లా చెప్పాడు.
‎
‎'విద్యచే భూషితుండయి వెలయుచున్న
‎దొడరి వర్జింప నగుజుమీ దుర్జనుండు
‎చారు మాణిక్య భూషిత శస్త మస్త
‎కంబు గల పన్నగము భయంకరము గాదె'
‎
‎పాము శిరస్సునందు ఎంతో విలువ చేసే రత్నం ఉన్నప్పటికీ పాము విష పూరితం. అందునా భయంకరమైనది కాబట్టి రత్నంను తీసుకోవటానికి ఎవరూ సాహసం చెయ్యరు. పైగా అటువంటి పామును దూరంగా తన్ని వదిలివేస్తారు.
‎అదే విధంగా ఎంతో గొప్పగా చదువుకొన్నప్పటికీ
‎మూర్ఖుడు, దుర్జన స్వభావం కల విజ్ఞానవంతునితో ఎవరూ స్నేహం చెయ్యరు. కాబట్టి చదువు కాదు మంచి ప్రవర్తన ముఖ్యం. మంచి ప్రవర్తనను, నడతను నిర్దేశించేది నోటి మాట. కాబట్టి మంచి మాట మాట్లాడాలి.
‎
‎'నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
‎తళుకు బెళుకు రాలు తట్టెడేల?
‎చదువ పద్యమరయ జాలదా యొక్కటి?విశ్వదాభిరామ వినురవేమ...?'
‎
‎అని వేమన చెప్పినట్లుగా తళుకులీనే పనికి రాని రాళ్ళు తట్ట నిండా అవసరం లేదు. విలువగల నిక్కమైన మంచి నీలం ఒక్కటి ఉంటే చాలు, గంటలకొద్దీ ఉపన్యాసాలు అక్కర్లేదు, పేజీలకొద్దీ సోది అక్కర్లేదు. మంచి భావం గల ఒక మంచి మాట చాలు అంటాడు వేమన.
‎అదే విధంగా
‎
‎'గంగి గోవుపాలు గరిటెడైనను చాలు
‎కడవడైన నేమి ఖరము పాలు
‎భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు
‎విశ్వదాభిరామ వినుర వేమ'
‎
‎గాడిద పాలు కుండల నిండా ఉన్నా ఉప యోగం లేదు. మంచి ఆవు పాలు చిన్న గరిటెడైనా చాలు పూజకు, పవిత్రతకు పనికి వస్తాయి. అట్లాగే భక్తితో పెట్టిన ఒక్క ముద్ద భోజనమైనా చాలు కడుపు నిండటానికి అని వేమన చెప్పినట్లుగా లొడలొడా వాగుతూ, అవాకులు చెవాకులు పేలుతూ' ఊరికే గంటల కొద్దీ మాట్లాడే సోది వద్దు. చెవులకింపుగా, వివసొంపుగా, బహు పసందుగా ఒక మంచి మాట మాట్లాడితే చాలు అదే తృప్తినిస్తుంది.
‎
‎పది మందిలోనూ తనకో ప్రత్యేకత కావాలంటూ ఉన్నవీ లేనివీ కల్పించి, అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు కొందరు. తనకు తెలిసినది కొద్దిగానే ఐనా ఎంతో తెలుసన్నట్లుగా తెగ మాట్లాడుతూ గొప్పలు చెబుతుంటారు మరికొందరు. '
‎'కల్లలాడు వారి మాట కలకాలం నిలవదు'
‎'కల్లబొల్లి కబుర్లు కాలంలో నిలవవు' అన్నట్లుగా ఏదేదో వాగుతుంటారు, రకరకాల విషయాల గురించి తెలుసన్నట్లుగా మాట్లాడుతూ దేనిమీద నిలకడ లేనట్టుగా మాట్లాడుతుంటారు చాలా మంది.
‎అటువంటి వారిని గురించి
‎
‎'మాట నిలుప లేని మహితుండు చండాలు
‎డాజ్ఞ లేని నాథు డాడుముండ
‎మహిమ లేని వేల్పుమంటి జేసిన పులి
‎విశ్వదాభిరామ వినురవేమ'!
‎అని అన్నాడు వేమన.
‎అంటే మాట నిలకడ లేనివాడు నీచుడు.
‎ప్రభువు ఆజ్ఞ జారీ చెయ్యలేనివాడు పనికిమాలినవాడు.
‎మహిమ లేని దేవుడు మట్టి పులితో సమానం... కాబట్టి నిలకడగా మాట్లాడాలి. నిలకడగా మాట్లాడాలి అంటే మంచి మాటలే మాట్లాడాలి. అందుకనే మనవాళ్ళు చెప్పుతుంటారు తక్కువ మాట్లాడే వానికి విలువ ఎక్కువ అని, అస్తమానూ ఏదో ఒకటి
‎మాట్లాడే వాడి గురించి ఎవరూ పట్టించుకోరు. అంతేరా.. వాడు అస్తమానూ ఏదో ఒకటి వాగుతుంటాడు అంటూ హేళన చేస్తారు.
‎
‎మాట ప్రధానం. మంచిగా మాట్లాడాలి. భావం, అర్ధం కలిసిన మాటలు కొద్దిగా ఐనా, తక్కువ సేపే మాట్లాడినా చాలు ఇతరుల హృదయాలను చేరుకొంటాయి.
‎
‎"వాక్కు వలన గలుగు పరమగు మోక్షము
‎వాక్కు వలవ గలుగు వరలు ఘనత
‎వాక్కు వలన గలుగు నెక్కుడైశ్వర్యంబు విశ్వదాభిరామ వినురవేమ!"
‎
‎మనం మాట్లాడే మాటల వలనే మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ సమకూరతాయి. కాబట్టి తగిన విధంగా మాట్లాడాలి. పదుగురినీ మెప్పించేలా మాట్లాడాలి అంటాడు వేమన
‎
‎'మాట చెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
‎మాట విన్న నరుడు మాన్యుడగును
‎మాట వినగ చెప్ప మానుట కూడదు
‎విశ్వదాభిరామ వినరవేమ'
‎
‎ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్లోని యుక్త యుక్తాలను తెలుసుకోలేనివాడు మూర్ఖుడు. మాట వినేవాడు గౌరవించ తగినవాడు. ఎదుటివారి మాటలను విన్నాక ఆలోచించి సరైన సమాధానం చెప్పటం మంచి పద్దతి. అట్లా మంచి పద్ధతిలో నడవాలంటే మనం మంచి మాటలే మాట్లాడాలి.
‎
‎'మాటల మాటలు వచ్చును
‎మాటలనే కలుగుచుండు మణి మంత్రంబుల్
‎మాటల పొందిక తెలిసిన
‎మాటలనే ముక్తి కలుగు మహిలో వేమా..'
‎అంటాడు వేమన మాట యొక్క మహత్యం గొప్పది. మనిషి మాటలే నిందను తెస్తాయి. మంత్రసిద్ధి కలిగిస్తాయి. పొందికగా మాట్లాడితే ఆ మాటల వల్ల ముక్తి కూడా దక్కుతుంది అని అంటాడు వేమన.
‎
‎కాబట్టి మంత్ర సిద్ధిని, ముక్తిని కలిగించే గొప్ప మహత్యంగల మాటలను, మంచి మాటలను అందరూ మాట్లాడాలి. అప్పుడే అట్లా మాట్లాడే వారికి సమాజంలో అధిక గౌరవం, విలువ. అటువంటి మంచి మాటలే అలంకారాలు, ఆభరణాలుగా
‎అమరుతాయి. కాబట్టి చక్కగా, మంచిగా
‎మాట్లాడండి... మనం మాట్లాడే మంచి మాటల వలన ఎన్నో విజయాలు చేకూరతాయి కాబట్టి నిదానించి మంచి మాటలను ఎంచుకొని మంచిగా మాట్లాడండి.
‎మరెన్నో విజయాలు సొంతం చేసుకోండి.
‎మంచి మాటే కంచు కోట అని మరువకండి.
‎
‎రచన ::-- అక్షర  కిరీటి తెన్నేటి మాస్టారు
‎సెల్ ::-- 8247433432
‎