జెడ్పి ఛైర్మన్,మంత్రి మండిపల్లిని కలిసిన పచ్చిపాల రామకృష్ణ ఆచారి
మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రం,మదనపల్లి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రవాణా,యువజన,క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,జిల్లా తొలి జడ్పీ చైర్మనుగా బాధ్యతలు స్వీకరించిన సుగవాసి ప్రసాద్ బాబులను శుక్రవారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్,మదనపల్లె 28వ వార్డు కౌన్సిలర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా వారిని పూలమాల,శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామకృష్ణ ఆచారి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు.జడ్పీ చైర్మనుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సుగవాసి ప్రసాద్ బాబు ఎంతో సమర్థవంతమైన నేత అని కొనియాడారు.అన్నమయ్య జిల్లా అభివృద్ధికి ఆయన బాటలు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.జిల్లాలో సీనియర్,జూనియర్ నాయకుల కలయికతో తెలుగుదేశం పార్టీ కళకళలాడుతోందని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ శ్రీరామ్ చినబాబు,21వ వార్డ్ టిడిపి ఇంచార్జి,ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి