జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ
జల్ పల్లి, మేజర్ న్యూస్: జల్ పల్లికి చెందిన జగన్ మృతి ఘటనపై టీఆర్జీ ఆస్పత్రిపై ప్రత్యేక విచారణ చేపట్టినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు.ఈ ఘటనపై శుక్రవారం ప్రత్యేక బృందాన్ని ఆస్పత్రి విచారణకు పంపించినట్లు ఆయన వెల్లడించారు.
విచారణలో భాగంగా ఆస్పత్రిని సందర్శించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు అక్కడి వైద్యుల అర్హతలు,వారు నిర్వహిస్తున్న విధులు,రోగులకు అందించిన చికిత్స,ఆస్పత్రి లైసెన్సులు,వాటి పునరుద్ధరణ తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఆస్పత్రి సామర్థ్యానికి మించి అత్యవసర కేసులను స్వీకరించిందా.? వైద్యులు నిబంధనలకు అనుగుణంగా చికిత్స అందించారా.? అనే అంశాలపైనా సమగ్రంగా విచారణ జరుపుతామన్నారు.జగన్ మృతి ఘటనలో ఆస్పత్రి నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అవసరమైతే ఆస్పత్రిని సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
గతంలో ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలను కూడా విచారణలో పరిగణనలోకి తీసుకొని పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్, రాజేంద్రనగర్.