విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు
మెదక్ ; గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో పోటీతత్వాన్ని పెంపొందించడం మరియు సాధారణ పరిజ్ఞానం పట్ల ఆసక్తిని కలిగించాలనే ఉన్నత లక్ష్యంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో, చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలోని కేజీ విబి పాఠశాలలో, జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలు కేజీవిబీ మరియు మోడల్ స్కూల్ లలోవిద్యార్థులకుమండల స్థాయి క్విజ్ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. శుక్రవారం కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.క్విజ్ జరుగుతున్న తీరును, విద్యార్థులకు అడుగుతున్న జనరల్ నాలెడ్జ్, సైన్స్, గణితం మరియు సాంఘిక శాస్త్ర ప్రశ్నల ప్రమాణాలనుపరిశీలించారు.విద్యార్థులతో పోటీలలో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూవిద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పాఠ్యపుస్తకాలతో పాటు సమకాలీన అంశాలపై (Current Affairs) అవగాహన పెంచుకోవాలని సూచించారు.విద్యార్థుల్లో పుస్తక పఠనం మరియు వార్తాపత్రికలు చదివే అలవాటు పెరిగిందని సూచించారు.రాబోయే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు సిద్ధమవడానికి ఇది ఒక చక్కని వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు నిలుస్తాయన్నారు.చెప్పారు.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో ఇలాంటి విద్యా సంబంధిత కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామన్నారు.