BREAKING
విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విద్యార్థుల ప్రతిభను గుర్తించాలి జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్ వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు రామాయంపేటలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇందిరమ్మ భీమాతో ప్రతీ కుటుంబానికి ఆర్థికభరోసా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జెసీ నగేష్ జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం - నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం

డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

Select Suryaa Now
డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

రామాయంపేట ;  బీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ సంఘటితంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయమైన వాటా, సామాజిక న్యాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న బీసీ జన గర్జన, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా శుక్రవారం రామాయంపేట మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించనున్న బీసీ జన గర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సమాన అవకాశాలు సాధించుకోవాలంటే ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు. కులాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా బీసీలందరూ ఒకే వేదికపైకి వచ్చి తమ హక్కుల కోసం గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగే జన గర్జన కార్యక్రమానికి తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోబీసీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం జిల్లా యువత అధ్యక్షుడు పోచమ్మ గణేష్ గుల్పర్తి రాము తో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు