BREAKING
ఇందిరమ్మ భీమాతో ప్రతీ కుటుంబానికి ఆర్థికభరోసా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జెసీ నగేష్ జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం - నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం గోవింద నామస్మరణతో మార్మోగిన ఎస్.రాయవరం! మాకవరపాలెం జడ్పీటీసీగా అల్లు రామనాయుడు ప్రమాణ స్వీకారం క్రీడల్లో పాల్గొనడం వలన మంచి డైరెక్టర్ వ్యాయామం, అభినందించిన ఏ యూ డైరెక్టర్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆచార్య ఎ. పల్లవి పెనుగొల్లులో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల! గెడ్డపాలెంలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటిన పీవీఆర్! కోనసీమ జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య.. హోంమంత్రి అనిత సహకారంతో అభివృద్ధి చేస్తా!

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సూర్య, నంద్యాల బ్యూరో:మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నంద్యాల జిల్లాలోని 9 మండలాల పరిధిలో ఉన్న 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూపాడుబంగ్లా, కొత్తపల్లి, మిడుతూరు, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, బేతంచర్ల, డోన్, ప్యాపిలి మండలాల్లోని 158 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 1,606 వార్డులకు సంబంధించి 1,607 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబరు 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, నవంబరు 23తో ముగుస్తుంది. నవంబరు 24న నామినేషన్ల పరిశీలన, 25న అప్పీళ్ల దాఖలు, 26న అప్పీళ్ల పరిష్కారం, 27న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అవసరమైన చోట డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*