ఇందిరమ్మ భీమాతో ప్రతీ కుటుంబానికి ఆర్థికభరోసా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జెసీ నగేష్
పెద్దశంకరంపేట ; తెలంగాణా ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రతీ పేదకుంటాబానికి ఆర్థిక భరోసా అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్సప్లై అధికారి జగదీష్లతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రారంబించారని, గ్రామస్థాయిలో ఈ పథకంపై అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. గత ఆగస్ట్ 14 నుండి రైతుభీమా ఆగిపోయిన తర్వాత చనిపోయిన రైతుకుటుంబాలకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ నారాయణ ఎంపీడీఓ షాకీర్అలీ, సర్పంచ్ జంగం రేణుక, నాయకులు నారాగౌడ్. మధు. మురశిపంతులు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, కుంట్ల రాములు, సుభాష్ గౌడ్,రాజుగౌడ్, సుభాష్, అవ్వసుల భవాణి తదితరులున్నారు.