BREAKING
విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విద్యార్థుల ప్రతిభను గుర్తించాలి జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్ వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు రామాయంపేటలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇందిరమ్మ భీమాతో ప్రతీ కుటుంబానికి ఆర్థికభరోసా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జెసీ నగేష్ జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం - నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్ మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన ఓటర్లకు మరో అవకాశం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆనందపురం నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గంటా ఘన సత్కారం బ్రహ్మలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు* ఎస్.రాయవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సోమిరెడ్డి లక్ష్మి నామినేషన్! మాడుగుల జడ్పీటీసీ సభ్యునిగా పుప్పాల లక్ష్మి నారాయణ ప్రమాణ స్వీకారం

వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

Select Suryaa Now
వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

కొల్చారం ..కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య పరిష్కారానికి మంజీరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మించాలని చేసిన విజ్ఞప్తికి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తక్షణమే స్పందించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.బుధవారం తుక్కాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు సభా వేదికపై గ్రామ రైతాంగం తరఫున మంజీరా నదిపై చెక్‌డ్యామ్ నిర్మించాలని కోరారు. రైతుల విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకున్న ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం పట్ల గ్రామ రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
రైతుల సాగునీటి అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి తుక్కాపూర్ గ్రామ రైతాంగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.