రామాయంపేటలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక..
రామాయంపేట ; రామాయంపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ కౌన్సిలర్ రాఫ్ శ్యామ్‌తో పాటు సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి, చౌదరి సుప్రభాత్ రావు రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే. చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె. జితేందర్ గౌడ్, సీనియర్, కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్, నాయకులు ఉమామహేశ్వర్, ఆసనోదిన్,అహ్మద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.