విద్యార్థుల ప్రతిభను గుర్తించాలి జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసి, వారిలో విజ్ఞానం, తార్కిక ఆలోచనా సామర్థ్యం, పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో వివిధ పోటీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న 2026”**లో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలు విజయవంతంగా పూర్తయ్యాయనీ,జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించిన ఈ పోటీలలో ఆయా మండలాల పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు , ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన 8వ, 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారరూ.జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ శంకరంపేట-ఆర్ మండలంలో నిర్వహించిన క్విజ్ పోటీలను పరిశీలించి, విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు.అదనపు కలెక్టర్ నాగేష్ టేక్మాల్ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.హవేలీఘన్పూర్ మండలం లో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలను పరిశీలించారు.మండల స్థాయి పోటీలలో ప్రతి మండలం నుండి 8వ, 9వ మరియు 10వ తరగతులకు చెందిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సంబంధిత అధికారులు మెమెంటోలు అందజేసి అభినందించారు.
జిల్లా స్థాయి సెమీఫైనల్
మండల స్థాయిలో ఎంపికైన జిల్లాలోని 21 మండలాలకు చెందిన మొత్తం 63 మంది విద్యార్థులతో 26 నవంబర్ 2026న జిల్లా స్థాయి సెమీఫైనల్ క్విజ్ పోటీలు నిర్వహించబడతాయి.
ప్రతి మండలం నుండి ఎంపికైన ముగ్గురు విద్యార్థులతో పాటు ఒక గైడ్ టీచర్ జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు. సెమీఫైనల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 6 టీమ్‌లను ఫైనల్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
జిల్లా స్థాయి ఫైనల్ పోటీలు:
జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్ 2026న ,లో నిర్వహించబడతాయనీ,
ఫైనల్ పోటీలలో విజేతలకు క్రింది విధంగా నగదు బహుమతులు అందజేయబడతాయన్నారు.
- ప్రథమ బహుమతి: ₹90,000/- (తొంభై వేల రూపాయలు)
- ద్వితీయ బహుమతి: ₹60,000/- (అరవై వేల రూపాయలు)
- తృతీయ బహుమతి: ₹30,000/- (ముప్పై వేల రూపాయలు)
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో పోటీ స్ఫూర్తిని పెంపొందించడం, సాధారణ జ్ఞానం మరియు తార్కిక ఆలోచనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలతో నిర్వహిస్తున్న ఈ క్విజ్ పోటీలను విజయవంతం చేయడానికి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు.