BREAKING
వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్ అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా? ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..? రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత

Select Suryaa Now
కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి  సునీత

 

కూటమి నిర్ణయాన్ని ప్రకటించిన జిల్లా నాయకత్వం.


రావికమతం నవంబర్ 21 మేజర్ న్యూస్: మండలంలో మేజర్ పంచాయితీ కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన పాకల పాటి సునీత పేరును శుక్రవారం రాత్రి ప్రకటించారు. అనకాపల్లి జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడు బత్తుల  తాతయ్య బాబు, చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు, చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు, మండల టిడిపి అధ్యక్షుడు రాజాన కొండనాయుడు శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు.  టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా లోకేష్ ఆదేశాల మేరకు కొత్తకోట సర్పంచ్ అభ్యర్థిగా పాకలపాటి సునీత పేరును ప్రకటించారు. ఈమె విజయానికి మూడు పార్టీల కార్యకర్తలు కృషి చేయాలని సంయుక్తంగా కోరారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత మండలంలో కొత్తకోట  సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని చోడవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్  పి వి ఎస్ ఎన్ రాజు ప్రతిపాదించారు. ఈ నిర్ణయం పై  ఎటువంటి ప్రకటన వెలువడక ముందే  గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కార్యకర్తలు సర్పంచ్ అభ్యర్థిగా వెల్లంకి రాజేశ్వరి చే నామినేషన్ వేయించారు. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి పాకలపాటి సునీత  సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. ఈ విషయం కూటమి అధిష్టానం దృష్టికి వెళ్ళింది. అధిష్టానం ఆదేశాల మేరకు   సమావేశమైన  స్థానిక కూటమి నాయకులు  పాకలపాటి సునీత  అభ్యర్థి  గా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన కూటమి పార్టీల స్థానిక నాయకులు , కార్యకర్తలు పై జాతీయ పార్టీకి నివేదిక పంపుతామని జిల్లా అధ్యక్షులు చోడవరం ఎమ్మెల్యే ప్రకటించారు.