BREAKING
వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్ అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా? ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..? రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్

Select Suryaa Now
నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ   ఎంపీడీవో చంద్రశేఖర్

 

పాములపాడు: మేజర్ న్యూస్: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ నిర్వహించడంతో పాటు అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని వివరించారు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు:

మండలంలోని గ్రామాలను నిర్దేశించిన గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

- చెలిమిళ్ల గ్రామపంచాయతీ కార్యాలయం: చెలిమిళ్ల, లింగాల, ఇస్కాల గ్రామాలు.

- జూటూరు గ్రామపంచాయతీ కార్యాలయం: జూటూరు, తుమ్మలూరు గ్రామాలు.

- కొత్త భానుకచెర్ల గ్రామపంచాయతీ కార్యాలయం: కొత్త భానుకచెర్ల, భానుముక్కల, వేంపెంట, ఎర్రగుడూరు గ్రామాలు.

- మిట్టకందాల గ్రామపంచాయతీ కార్యాలయం: మిట్టకందాల, మద్దూరు గ్రామాలు.

- పాములపాడు గ్రామపంచాయతీ కార్యాలయం: పాములపాడు, రుద్రవరం, కాగా వానాల మాత్రం అదే గ్రామంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో. నామినేషన్లు స్వీకరిస్తామన్నారు .