ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..?
వికారాబాద్ మేజర్ న్యూస్: లక్షలాది మంది క్రైస్తవ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ధారూర్ మెథడిస్ట్ క్రైస్తవ జాతర నిర్వహణ, ఆదాయ వ్యయాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతర ముగిసి 6 రోజులు కావస్తున్న ఇప్పటివరకు ఆదాయపు వివరాలను బయటకి చెప్పకపోవడంతో జాతర నిర్వాహకులపై ట్రస్ట్ సభ్యుల తీరు పట్ల భక్తుల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు ధారూర్‌లో 104వ క్రైస్తవ జాతర ఘనంగా జరుగగా చివరి రోజైన నవంబర్ 15 ఆదివారం సాయంత్రం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలను డీసీఎం వాహనంలో వికారాబాద్‌లోని మేరీనాట్ గెస్ట్ హౌస్ లోకి తరలించి నవంబర్ 16 నుంచి హుండీల లెక్కింపు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.104 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటూ, విశ్వాసంతో లక్షలాదిమంది భక్తులు హుండీలలో కానుకలు, బంగారు ఆభరణాలు, వెండి, వివిధ రకాలుగా దేవుడి పేరు మీద కానుక సమర్పిస్తారు. అయితే లక్షలాది మంది భక్తులు సమర్పిస్తున్న కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడ జమ అవుతోంది? జాతర అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు జాతర నిర్వాకులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జాతర ముగిసి ఆరు రోజులైనా లెక్కలపై స్పష్టత ఇవ్వకపోవడతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే లెక్కింపు ప్రారంభమై ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని అధికారికంగా ట్రస్ట్ సభ్యులు ప్రకటించకపోవడం భక్తుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. లెక్కింపు ప్రక్రియలో ఎంతమంది పాల్గొంటున్నారు, లెక్కింపు పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
*100 ఏళ్లు అయినా అభివృద్ధికి నోచుకోని జాతర ప్రాంగణం* !
ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతర ప్రాంగణం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదని పలువురు క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతర సమయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, భక్తులకు అవసరమైన వసతుల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు. జాతర ద్వారా కోట్లల్లో వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రాంగణ అభివృద్ధికి కేటాయిస్తున్నారా? కేటాయిస్తే గత ఐదేళ్లలో ఎన్ని పనులు చేపట్టారు? వాటికి ఎంత ఖర్చు చేశారు? అనే వివరాలను నిర్వాహకులు వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని
I
*ట్రస్ట్ ట్రెజరర్ను ప్రశ్నించగా మౌనం!*
మెరీనాట్ గెస్ట్ హౌజ్ ప్రాంగణంలో హుండీల ఆదాయ వివరాలపై బెంగళూరు, హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ పాల్ మధుకర్‌ను పలువురు విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా మౌనంగా వెళ్లిపోవడంతో మరిన్ని సందేహాలకు కారణమవుతోంది. అయితే ఆయన వివరణను కూడా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువరు తెలుపుతున్నారు. ఇప్పటికైనా హుండీ లెక్కింపు పూర్తయిన తర్వాత మొత్తం ఆదాయం, జాతర నిర్వహణకు అయిన ఖర్చులు, మిగిలిన నిధులు, అభివృద్ధి పనులకు కేటాయించిన మొత్తాన్ని బహిరంగంగా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు.