BREAKING
ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..? రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా యూట్యూబ్‌ సంస్థపై అమెరికా పాఠశాలల కేసులో 300 కోట్ల డాలర్ల పరిష్కార ప్రతిపాదన.. విద్యార్థుల మానసిక ఆరోగ్య వివాదంలో కీలక మలుపు! స్వయంచాలిత వాహనాల్లో లోపాలపై రెండు వెనక్కి పిలుపు ప్రకటనలు చేసిన వేమో.. రోబోటాక్సీల భద్రతపై కీలక చర్యలు! నేటి పంచాంగం: నవంబర్ 21, శనివారం.. తులసీ వివాహం, క్షీరాబ్ధి ద్వాదశి విశేషాలు! నవంబర్ 21 (శనివారం) నాటి 12 రాశుల దినఫలాలు రాజమహేంద్రవరం జీఎంసీలో రెండు రోజుల మెడికో-లీగల్ శిక్షణ మరియు వర్క్‌షాప్ ప్రారంభం విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విద్యార్థుల ప్రతిభను గుర్తించాలి జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్ వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు రామాయంపేటలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు

Select Suryaa Now
రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు

రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు

రైతులకు మరింత పారదర్శకంగా ఎరువుల పంపిణీ – ముందస్తు బుకింగ్‌తో సులభంగా కొనుగోలు

రొంపిచెర్ల, మేజర్ న్యూస్ (సూర్య ప్రతినిధి, నూరేషా): రైతులకు ఎరువుల విక్రయాలను మరింత పారదర్శకంగా, సులభతరంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిందని వ్యవసాయ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా ఎరువుల కొనుగోలు ప్రక్రియను డిజిటలైజ్ చేయడంతో పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు తీసుకోవచ్చు అన్నారు. ఈ విధానంలో యూరియా, డీఏపీ ఎరువుల వినియోగానికి సంబంధించి ఇప్పటికే ఉన్న సిఫార్సుల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. రైతులు ముందుగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా తమకు అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవాలని కోరారు. బుకింగ్ పూర్తయిన అనంతరం రైతులకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌తో పాటు టోకెన్ ఐడీ జారీ చేస్తారు. టోకెన్ జారీ అయిన 48 గంటల్లోపు సంబంధిత ఎరువుల దుకాణానికి వెళ్లి క్యూఆర్ కోడ్‌ను చూపించి ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. రైతులకు నూతన విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, బుకింగ్ ప్రక్రియలో సహకారం అందించేందుకు ప్రతి ఎరువుల విక్రయ కేంద్రంలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంపై పూర్తి వివరాలు తెలుసుకొని, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.