BREAKING
గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా యూట్యూబ్‌ సంస్థపై అమెరికా పాఠశాలల కేసులో 300 కోట్ల డాలర్ల పరిష్కార ప్రతిపాదన.. విద్యార్థుల మానసిక ఆరోగ్య వివాదంలో కీలక మలుపు! స్వయంచాలిత వాహనాల్లో లోపాలపై రెండు వెనక్కి పిలుపు ప్రకటనలు చేసిన వేమో.. రోబోటాక్సీల భద్రతపై కీలక చర్యలు! నేటి పంచాంగం: నవంబర్ 21, శనివారం.. తులసీ వివాహం, క్షీరాబ్ధి ద్వాదశి విశేషాలు! నవంబర్ 21 (శనివారం) నాటి 12 రాశుల దినఫలాలు రాజమహేంద్రవరం జీఎంసీలో రెండు రోజుల మెడికో-లీగల్ శిక్షణ మరియు వర్క్‌షాప్ ప్రారంభం విజ్ఞాన వికాసానికి వేదికగా మండల స్థాయి క్విజ్ పోటీలు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విద్యార్థుల ప్రతిభను గుర్తించాలి జిల్లా స్థాయి ఫైనల్ క్విజ్ పోటీలు 02 డిసెంబర్ వేదికపైనే హామీ కాదు.. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాయడంపై రైతుల హర్షం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు రామాయంపేటలో కాంగ్రెస్‌కు చెందిన యువకులు బీఆర్‌ఎస్‌లో చేరిక.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కళాశాల వంటశాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ డిసెంబర్ 14, 15 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇందిరమ్మ భీమాతో ప్రతీ కుటుంబానికి ఆర్థికభరోసా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జెసీ నగేష్ జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేస్తాం - నూతన జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ బుర్హానుద్దీన్

గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

Select Suryaa Now
గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

సేవకుడిగా పనిచేస్తా... సర్పంచిగా ఒక్క అవకాశం ఇవ్వండి 
- అక్కంపల్లి వైసిపి, సిపిఐ బలపరిచిన  సర్పంచ్ అభ్యర్థి డి. మాధవరెడ్డి 
- అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  అక్కంపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...  సేవకుడిగా పని చేస్తానని, సర్పంచ్ గా ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని వైసిపి, సిపిఐ మద్దతుతో పోటీ చేస్తున్న డి మాధవరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం  అక్కంపల్లి గ్రామంలో వైసిపి, సిపిఐ నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ  నాకు ఎలాంటి రాజకీయ పదవి లేకుండానే..  అక్కంపల్లిలో రాజకీయ  పార్టీ  నాయకుడిగా   గత 30 సంవత్సరాలుగా.. అక్కంపల్లి పంచాయతీలో ఏ సమస్య వచ్చిన ప్రజలకు.. అటు అధికారులతో, ఇటు ప్రజాప్రతినిధులతో మాట్లాడి  పరిష్కరించానని తెలిపారు. తాను నిత్యం  ప్రజల మధ్య ఉంటూ..... ప్రజలతో సత్సంబంధాలు , ప్రతి ఒక్కరితోనూ నేరుగా పరిచయాలు.. పిలిస్తే పలికే వాడిగా పని చేశానని తెలిపారు. సర్పంచిగా అవకాశం ఇస్తే ఇక ముందు కూడా.. మరింత మెరుగ్గా పనిచేసి.. పంచాయతీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అక్కంపల్లి పంచాయితీలో సమస్యలపై అవగాహన ఉందని, ముఖ్యంగా అక్కంపల్లి, సదాశివ కాలనీ కాలనీ, ధర్మ బిక్షం కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఎన్ ఆర్ కాలనీ లో  సిసి రోడ్డు నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, నీటి సమస్య పరిష్కారం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతానని తెలిపారు. అక్కంపల్లి ప్రజలు ఆలోచించి .. అందుబాటులో ఉండే.. సమస్య వస్తే అండగా నిలిచే వ్యక్తులని సర్పంచ్ గా ఎన్నుకోవడం ద్వారానే న్యాయం జరుగుతుందని తెలిపారు.