BREAKING
వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్ అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా? ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..? రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?

Select Suryaa Now
అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ!  నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?

బల్లికురవ మేజర్ న్యూస్: 

నక్కబొక్కలపాడు గ్రామంలోని అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పరిసరాలన్నీ చిట్టడవిని తలపిస్తున్నాయి. చిన్నారులకు విద్యాబుద్ధులు, పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రం వద్దే ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం నెలకొనడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

భవనం ముందు ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం దర్శనమిస్తున్నాయి. పాములు, విషపురుగులు సంచరించే ప్రమాదం ఉన్నప్పటికీ పరిసరాలను శుభ్రం చేయడంపై సంబంధిత అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

చిన్నారుల భద్రత, ఆరోగ్యం విషయంలో ఇంత నిర్లక్ష్యమా? అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించరా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అంగన్వాడీ భవనం ఎదుట పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

కొణిదెన నరేంద్ర బల్లికురవ మండలం సూర్య రిపోర్టర్