BREAKING
వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్ అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా? ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..? రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానంలో ఎరువుల విక్రయాలు గ్రామ సర్పంచ్ గా ఒక అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా

బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు

Select Suryaa Now
బీసీ సీటులో  ఓసిని ఎలా కూర్చోబెట్టారు

బీసీ మహిళకు కేటాయించి సీట్ లో బీసీలో కూర్చోవాలి..
ఈ ప్రభుత్వాన్ని భర్త రప్ చేయాలి....
న్యాయస్థానలపై మాకు నమ్మకం ఉంది..

బీసీ సర్టిఫికేట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు.  చంద్రబాబు బుద్ధి ఏమైంది....

.ఇదేనా బిసిల పై చంద్రబాబుకు ప్రేమ....

శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం......

విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్:    జిల్లా పరిషత్ బీసీకి కేటాయిస్తే ఓసీలకు ఎలా ఇచ్చారనీ శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెలమలు కాపులు యాదవులు లేరా చంద్రబాబు ఏమైంది మీ సీనియారిటీ అని ఎద్దేవ చేశారు. ఎందుకు బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు చీవాట్లు పెట్టింది  చంద్రబాబు మీ బందువులకైతే ఒక న్యాయం ఇతరులకు మరో  నాయ్యమా అన్నారు. నకలీ ధృవపత్రాలు ఇస్తూ ఎన్నికలలో పాల్గొని అడ్డంగా  అధికార దుర్వినియోగం చేశారని మండి పడ్డారు.
ఈ అంశాలపై గవర్నర్ ని కలవాలని నిర్ణయించుకున్నాం అన్నారు.
ఈ ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చెయ్యాలని డమాండ్ చేస్తున్నాం అన్నారు.
‌స్థానిక ఎన్నికలలో మనాళని వందేళ్లు వెనుకకు తీసుకువెళ్లాయన్నారు.
చంద్రబాబు రాజకీయంగా నీచమైన సంస్కృతి కి తీసుకు వెళ్లారన్నారు.
ముగ్గురు పార్లమెంటు సభ్యులు పై దాడి చేశారనీ, కత్తులు పెట్రోల్ బాంబులతో దాడి చెయ్యడం ప్రజాస్వామ్యా అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్ధం కోసం రాజ్యాన్ని చెప్పు చేతలలో పెట్టుకుంటున్నారనీ ఎంపీపీ ఎన్నికలకు రావాలని మా ఎంపీటీసి లకు నోట్ పంపారు పూసపాటిరేగ లో వైసీపీ సభ్యులు అందరూ హాజరయ్యారనీ వైసీపీ అభ్యర్ధ మహంతి శ్రీనివాస్ రావు ని ఎన్నికై నట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారనీ హాజరైన సభ్యులు నిరాకరిస్తున్నారని మళ్లీ ఎన్నిక నిర్వహిస్తున్నామని తిరిగి నోట్ పంపారు ఇది ఎన్నికల నిర్వహణ తీరా అని నిలదీశారు.అందుకే  అప్రజాస్వామ్యంగా ఈ ఎన్నికలు జరిగాయని చెబుతున్నాం అని
ఎన్నికైన తరువాత కూడా మార్పుచేసి మళ్లీ ఎన్నికలకి సిద్దపడ్డారన్నారు.     జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ 
బొత్స అనుషా మీద, జగన్ మీద సోషల్  మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నారు.
బొండపల్లి లో ప్రభుత్వం మనకేమి చేసింది అని ప్రచారం చేసుకున్నారు
ఎవ్వరినీ విమర్శించలేదే 
కానీ అనవసరమైన ట్రోల్స్ చేస్తున్నారే...
వాటిని ఆపాలని ఎందుకు చెప్పలేదన్నారు. పవన్ నాలుగు పెళ్లిలు చేసుకున్నారు దానిపై మాట్లాడవద్దంటే మేము మాట్లాడలేదే అన్నారు.