BREAKING
సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే. అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్ అంగన్వాడీ భవనం ఎదుట పిచ్చిమొక్కల రాజ్యం.. పట్టించుకునే అధికారులేరీ! నక్కబొక్కలపాడు అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో అపరిశుభ్రత.. చిన్నారుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా? ధారూర్ జాతర హుండీ ఆదాయం అవకతవకలా..?

నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక

Select Suryaa Now
నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక

నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక

మత్స్యకార దినోత్సవ సభకు భారీగా తరలిరావాలి – తోకల రాము యాదవ్ పిలుపు

 పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేడు కొల్లాపూర్‌లో నిర్వహించనున్న మత్స్యకార దినోత్సవ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు కొల్లాపూర్ నియోజకవర్గంలోని మత్స్యకారులు, ముదిరాజులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యదర్శి తోకల రాము యాదవ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం, సముచిత గుర్తింపు, తగిన ప్రాతినిధ్యం దక్కాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు, ముదిరాజులు సహా బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.రాజకీయంగా ఎదగాలంటే ఐక్యత, చైతన్యం, సంఘటిత శక్తి ఎంతో అవసరమని పేర్కొంటూ.. ఈ సభను ఒక వేదికగా భావించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. మన హక్కుల కోసం మన గొంతు వినిపించడంతో పాటు, భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార సాధనకు సమిష్టి కృషి అవసరమని తోకల రాము యాదవ్ పేర్కొన్నారు.