BREAKING
జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ. సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే. అమిత్ షాకు దమ్ముంటే ఓవైసీపై పోటీ చేయాలి వరికుంటలో మంచూరు మాస్టర్ ప్లాన్.. వైసీపీకి భారీ షాక్ నేడు కొల్లాపూర్‌కు తీన్మార్ మల్లన్న రాక జల్ పల్లి జగన్ మృతి ఘటనకు (టఆర్ జి) హాస్పత్రిపై ప్రత్యేక విచారణ కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు. బీసీ సీటులో ఓసిని ఎలా కూర్చోబెట్టారు నేపాల్‌పై ఇండియా-ఎ చారిత్రక విజయం.. 306 పరుగుల భారీ తేడాతో గెలుపు! న్యూజిలాండ్ గడ్డపై కేఎల్ రాహుల్ శతకం.. భారత్ పటిష్ట పోరాటం! ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం -బిసి అభ్యర్థులకు 25 వరకు చివరి అవకాశం కొత్తకోట కూటమి సర్పంచ్ అభ్యర్థి పాకలపాటి సునీత నేటి నుంచి గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఎంపీడీవో చంద్రశేఖర్

జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర

Select Suryaa Now
జిల్లావ్యాప్తంగా పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు : ఎస్పీ స్నేహ మెహ్ర


వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నేర నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనదారుల పత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 1,287 వాహనాలను తనిఖీ చేయగా, వాటిలో 610 ద్విచక్ర వాహనాలు, 218 త్రిచక్ర వాహనాలు, 296 నాలుగు చక్రాల వాహనాలు, 163 భారీ వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూ 120 ఈ-పెట్టీ కేసులు, 83 డీడీ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 272 ఈ-చలాన్లు జారీ చేసి మొత్తం రూ.98,730 జరిమానా విధించారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు జిల్లాలో నేర నియంత్రణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. నాకాబందీ తనిఖీల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు రహదారి భద్రతా నిబంధనల అమలును పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నేరరహిత, సురక్షిత వికారాబాద్ జిల్లా నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.