107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా
లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణానికి మంజూరైన 107 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్‌ను ఆదివారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అర్హులైన పేదలకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, కమిషనర్ చంద్రప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.