BREAKING
నవంబర్ 23-27 వారంలో కీలక కార్పొరేట్ యాక్షన్లు: జీ ఎంటర్‌టైన్‌మెంట్ బైబ్యాక్, రైట్స్ ఇష్యూలు, డివిడెండ్ స్టాక్స్ పూర్తి జాబితా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు భారమో వివరించిన యూబీఎస్ ఇండియా రీసెర్చ్ హెడ్ గౌతమ్ ఛావోచారియా ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.5,016 చొప్పున అందజేత ప్రతి ఇంటికీ పరిచయమైన ముఖం.. ప్రతి మనసుకూ దగ్గరవుతున్న నాయకుడు :ప్రవీణ్ రెడ్డి యాదవుల ఐక్యతకు సదర్ సమ్మేళనం వేదిక ‎నిన్నే రూపముగా సేవించాలో శివయ్యా.… ‎(ఆథ్యాత్మిక వ్యాసం..) సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు! 107 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా బైరెడ్డిపల్లి మండలంలో 21సర్పంచ్ స్థానాలకు 46 మంది పోటీ, 172వార్డులకు 144 మంది పోటీ భారత్ భారీ స్కోర్.. న్యూజిలాండ్‌పై 352 పరుగుల ఆధిక్యం రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన బండ అంజి యాదవ్ ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం తిరుమల శ్రీవారి దర్శనం: 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు పొగమంచు పట్ల అప్రమత్తంగా ఉండండి,రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించండి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

Select Suryaa Now
సిరిసిల్ల రెండో బైపాస్‌లో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు!

సూర్య రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.చంద్రంపేట చౌరస్తా సమీపంలో సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వేములవాడ మండలం మారుపాకలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.ఉదయం వేళ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడం ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆర్టీసీ బస్సు ముందు టైరు ధ్వంసమైంది. కారులో ఒకరు బయటకు పడిపోగా,డ్రైవర్ సీటులోనే ఇరుక్కుపోయాడు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో బయటకు తీశారు.తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

.