ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్
మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.మున్సిపల్ కమిషనర్ ఎన్. కృష్ణారెడ్డి మాట్లాడుతూ… చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీలత రమేష్, మున్సిపల్ మేనేజర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.