BREAKING
2024 సెప్టెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పతనమై 2% కోలుకున్న బిట్‌కాయిన్: క్రిప్టో మదుపర్లకు స్వల్ప ఊరట పశుగ్రాస కొరత నివారణ కోసం... హరిత గోపాలం పథకం. ఇరాన్ అణు కార్యక్రమంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన... జిల్లా యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు భారత ఐటీ రంగానికి ఏఐ ముప్పుపై ఆందోళనలు అనవసరం: పీపీఎఫ్ఏఎస్ సీఐఓ రాజీవ్ ఠక్కర్! వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఎస్‌సీఓ ఫోరమ్ చర్చలు: కాలువ ఆక్రమణ కళ్యాణమండపం నిర్మాణం క్యూ3 ఫలితాలపై అంచనాలు తగ్గించుకోవాలి :నిపుణుడు రాఘవేంద్ర నాథ్! రోడ్డుపై నిలిచిపోయిన భారీ వాహనంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ వరికుంట సర్పంచ్‌గా ఇరగంరెడ్డి సునీత ఏకగ్రీవ ఎన్నిక నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. సియాంగ్ డ్యామ్ ప్రాజెక్టుపై ప్రజలతో చర్చలకు సిద్ధం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా!

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి

Select Suryaa Now
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి

*కొండమిట్టలో 27 వ వార్డ్ టీడీపీ అభ్యర్థి భీమల మునికృష్ణ ప్రచారం.


శ్రీకాళహస్తి  పట్టణంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భీమల మునికృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని కొండమిట్ట ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక ప్రజలను, ఓటర్లను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ హయాంలో కొండమిట్ట ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రూ.50 లక్షలకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాంత అభివృద్ధికి కృషి చేసినట్లు వివరించారు.

*ఇళ్ల పట్టాలపై ప్రత్యేక హామీ..*

కొండమిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యపై భీమల మునికృష్ణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక నివాసితులకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ఇప్పటికే దేవస్థానం, తహసీల్దార్ కార్యాలయ అధికారులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. స్థలాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల తయారీ ప్రక్రియను కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత అధికారులతో మరోసారి సంప్రదింపులు జరిపి, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన నివాసితులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎదురుచూస్తున్న స్థానికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.

*కూటమి అభ్యర్థులకు మద్దతు కోరుతూ ప్రచారం...*

అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టణ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భీమల మునికృష్ణ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి పేట బాలాజీతో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు మద్దతు కోరారు.

కొండమిట్ట ప్రాంతంలో నిర్వహించిన ఈ ఇంటింటి ప్రచారంలో స్థానిక నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి