రోడ్డుపై నిలిచిపోయిన భారీ వాహనంతో ట్రాఫిక్ ఇబ్బందులు
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా కేంద్రంలోని బై పాస్ రోడ్డులోని దేవిశ్రీ గార్డెన్స్ సమీపంలో ఓ భారీ వాహనం సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఆదివారం తెల్లవారుజామున డస్ట్ లోడుతో వెళ్తున్న లారీ బైపాస్ రోడ్డులో నిలిచిపోవడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, వాకర్స్ ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే బైపాస్ రోడ్డులో భారీ వాహనాలు తరచుగా నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.