వరికుంట సర్పంచ్‌గా ఇరగంరెడ్డి సునీత ఏకగ్రీవ ఎన్నిక
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా – సునీత
అట్లూరు, మేజర్ న్యూస్:
కడప జిల్లా అట్లూరు మండలంలోని వరికుంట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ నాయకుడు ఇరగంరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి ఇరగంరెడ్డి సునీత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలో సునీత ఏకగ్రీవంగా ఎన్నిక కావడం టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ఇరగంరెడ్డి సునీత మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బద్వేల్ టీడీపీ ఇన్చార్జ్, కడప డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డికి, అట్లూరు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న త్రిబుల్ షూటర్స్‌గా పేరొందిన మండల సీనియర్ నాయకులు ముడమాల ప్రభాకర్ రెడ్డి, అరవ శ్రీనివాసుల రెడ్డి, కొత్తపు మునిరెడ్డిలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. వరికుంట గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు ఇరగంరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తన సతీమణి సునీత సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన బద్వేల్ టీడీపీ ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డికి, మండల నాయకులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, పంచాయతీ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో వరికుంట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి పనిచేస్తామని ఇరగంరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
సూర్య రిపోర్టర్: ఎ. తిరుపాల్, అట్లూరు మండలం