BREAKING
క్యూ3 ఫలితాలు క్యూ2 స్థాయిలో ఉండకపోవచ్చు: మార్కెట్ నిపుణుడు రాఘవేంద్ర నాథ్ హీరో ఫిన్‌కార్ప్ భారీ విస్తరణ ప్రణాళిక… గేదె పాలపై రూ.6, ఆవు పాలపై రూ.4 పెంచిన 'గోకుల్' డెయిరీ: సేకరణ ధరల పెంపు నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం,,, బంగారం, లోహాల పతనం కొనసాగుతుందా? యూఎస్ కోర్ పీసీఈ ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లపైనే మదుపర్ల దృష్టి! క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 91 డాలర్లు భారత్‌కు ఎందుకు ప్రమాదకరం? చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ మండల కృష్ణ ఈ వారం డివిడెండ్ స్టాక్స్ అలర్ట్... చింతలమానేపల్లి ఎస్సై గా స్వరూప్ రాజ్ గల్ఫ్ గగనతలంలో అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామన్న ఇరాన్ గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి.. 2024 సెప్టెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పతనమై 2% కోలుకున్న బిట్‌కాయిన్: క్రిప్టో మదుపర్లకు స్వల్ప ఊరట పశుగ్రాస కొరత నివారణ కోసం... హరిత గోపాలం పథకం. ఇరాన్ అణు కార్యక్రమంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన... జిల్లా యువజన ఉత్సవాల్లో సత్తా చాటిన ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు

గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం.. ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి..

Select Suryaa Now
గ్రామ అభివృద్ధి..పేదల సంక్షేమమే ధ్యేయం..  ఆదరించండి.. అత్యధిక మెజారిటీతో గెలిపించండి  ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి..

చిట్టమూరు మేజర్ న్యూస్

గ్రామ అభివృద్ధిని కేవలం మాటలకే పరిమితం చేయకుండా,గ్రామంలోని ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యులుగా,పేదలు,సామాన్యులను సొంతవారిగా భావిస్తూ ఇప్పటివరకు అంకితభావంతో,చిత్తశుద్ధితో సేవలందించిన తాను.. భవిష్యత్తులోనూ అదే నిబద్ధతతో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవ చేయడమే లక్ష్యంగా ఎల్లసిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు పోచారెడ్డి సుకుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మేజర్ న్యూస్‌తో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, సంక్షేమం,పేదలకు సమన్యాయం, రైతుల సంక్షేమం,ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుబాటు లోకి తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.తనకు ఆస్తులు కూడబెట్టుకోవాలన్న ఆశ,వ్యక్తిగత ప్రయోజనాలపై ఆసక్తి లేదని,ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని ఆయన భావోద్వేగంగా తెలిపారు.తనకు సంతానం లేకపోయినప్పటికీ గ్రామంలోని నిరుపేదలు,ఆపన్నులు,అణగారిన వర్గాల ప్రజలనే తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరమైన వారికి చేతనైన సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానన్నారు.పదవులు,హోదాల కోసం కాకుండా ప్రజల మధ్య ఉంటూ వారి అభిమానాన్ని పొందడమే తనకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ,పేదలు,సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందిస్తానన్నారు.ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటిస్తూ,ప్రజాధనంలోని ప్రతి రూపాయిని సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేకుండా గ్రామ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.ఎల్లసిరి పంచాయతీని అభివృద్ధి,పరిశుభ్రత, మౌలిక వసతులు,సంక్షేమ పథకాల అమలులో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన సంకల్పమన్నారు. గ్రామంలో తాగునీరు,పారిశుధ్యం,వీధి దీపాలు,అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని వివరించారు. నిరాదరణకు గురైన పేద,సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందాల్సిన ప్రయోజనాలు ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హత ప్రాతిపదికన అందేలా కృషి చేస్తానన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ,పంచాయతీ ఆస్తుల పరిరక్షణ,అర్హులైన వారికి న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. రాజకీయాలకు,వ్యక్తిగత విభేదాలకు అతీతంగా గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని సమానంగా గౌరవిస్తూ, ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.యువతకు ప్రోత్సాహం, మహిళలకు సముచిత గౌరవం, రైతులకు అండదండలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఎల్లసిరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచానని,తన సేవాభావాన్ని,చిత్తశుద్ధిని గుర్తించి గ్రామ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పోచారెడ్డి సుకుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్