నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పడమటికోడిపల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రవి ఆహ్వానం మేరకు ఆయన కుమార్తె లక్ష్మీ (అనూష), తిమ్మరాయుడుతో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వివాహ వేడుకకు హాజరుకావడంతో రవి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :బోయ రంగస్వామి.