రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి
రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి
కందుకూరు, మేజర్ న్యూస్: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం డాక్టర్ స్వరూప ఆధ్వర్యంలో లేమూర్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగాచిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇమ్మిడి జంగయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్ కందుకూరు రంగారెడ్డి జిల్లా.