కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : శతాబ్దాల తరబడి కొనసాగుతున్న కుల వివక్ష, అసమానతలు తొలగిపోయి నూతన సమాజ నిర్మాణం జరగాలంటే విద్యార్థులతోనే సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ మాజీ రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ అన్నారు. ఎల్బీ నగర్‌లోని ఏబీసీ పాఠశాల ఆవరణలో నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్ము రాజశేఖర్ మాదిగ అధ్యక్షతన ఎంఎస్ఎఫ్ సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాల నూతన కమిటీల ఎన్నిక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు మందకృష్ణ మాదిగ సాగిస్తున్న ఉద్యమంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా దక్కిన 9 శాతం రిజర్వేషన్లను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగాల్లో రాణించాలని కోరారు. అనంతరం ఎంఎస్ఎఫ్ సరూర్‌నగర్ మండల అధ్యక్షుడిగా మొండికత్తి గణేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా మంద భాను మాదిగ,
ప్రధాన కార్యదర్శిగా బర్పటి వినయ్ మాదిగ, ఉపాధ్యక్షులుగా కందుల శివ మాదిగ, కార్యదర్శులు మంద ప్రభాస్ మాదిగ, మంద ఉమేష్ మాదిగ, ప్రచార కార్యదర్శి మంద మనోహర్ మాదిగ, ఏంఎస్ఎఫ్
హయత్‌నగర్ మండల కమిటీ అధ్యక్షుడిగా జకారం రామ్ చరణ్ మాదిగ, అధికార ప్రతినిధి ఎరపుల గణేష్, ప్రధాన కార్యదర్శిగా బస్థుల రామకృష్ణ మాదిగ, ఉపాధ్యక్షులు ముత్యాల స్టాలిన్ మాదిగ, కూమపాటి రజిని మాదిగ, కార్యదర్శులు గా కల్పూరి శ్రవణ్ మాదిగ, కినేరా భవ్య శ్రీ మాదిగ, ప్రచార కార్యదర్శి అరవింద్ మాదిగ , ఏమ్ ఎస్ ఎఫ్
చైల్డ్ కమిటీ అధ్యక్షుడిగా అంకురి కార్తీక్ మాదిగ, అధికార ప్రతినిధి గా మద్దిమడుగు శివ మాదిగ,ప్రధాన కార్యదర్శి అంకురి చరణ్ మాదిగ, ఉపాధ్యక్షులు దోసపాటి వినోద్ మాదిగ, కార్యదర్శులు కొత్తపల్లి కార్తీక్ మాదిగ, మొలగార శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర కళామండలి అధ్యక్షులు మల్లేపక అనిల్ మాదిగ, ఎంఎస్పీ ఎల్బీనగర్ ఇంచార్జ్ ఎర్ర రవీందర్ మాదిగ, , ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బత్తిన సుధాకర్ మాదిగ, ఏంఎస్పి యల్ బీ నగర్ కో ఇంచార్జి మల్లెపోగు రాజు,ఎంఆర్పీఎస్ హయాత్ నగర్ మండల అధ్యక్షులు కొమ్ము శివ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అనంత్ సురేష్ మాదిగ,రవి మాదిగ,కలకోట్ల సాయి మాదిగ,కొత్తపేట ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మంద శేఖర్ మాదిగ, కొత్తపేట సీనియర్ నాయకులు మీసాల నాగరాజు,సూరారపు హుస్సేన్,విజయ్,మహేందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు