కంభంలో తోట మహాలక్ష్మి ప్రచార జోరు
కంభం, మేజర్‌న్యూస్ :
మార్కాపురం జిల్లా, కంభం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కంభం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన తోట మహాలక్ష్మి గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, తమకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కంభం గ్రామ ప్రజలందరూ తమకు మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తోట మహాలక్ష్మి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కంభం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.