telangana
పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: అమీనుద్ధీన్ ప్రతి చిన్నారికి పోలియో డ్రాప్స్ వేయించడం తప్పనిసరి: భాగ్యానంద్ రావు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: మీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించి, ప్రభుత్వం కృషి చేస్తున్న పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని బీఆర్ ఎస్ గ్రేటర్ మాజీ కార్యదర్శి ఆమీనుద్ధీన్ కోరారు. ఆదివారం మౌలాలి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను ఆయన, మౌలాలి బీఆర్ఎస్ నాయకులతో కలిసి చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్ననాటే మీ బిడ్డ కు పల్స్ పోలియో డ్రాప్స్ వేయిస్తే, భవిష్యత్ లో అంగవైకల్యం బారిన పడకుండా ఉంటార ని ఇది వారికి రక్షణ కవచమన్నారు. సీనియ ర్ నేత మోనార్ భాగ్యానంద్ రావు మాట్లాడు తూ...పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలిం చాలంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి అన్నారు. తల్లిదండ్రులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుం డా చిన్న పిల్లలందరికీ రెండు చుక్కల పోలి యో డ్రాప్స్ వేయించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మౌలాలి ఆసు పత్రి వైద్య సిబ్బందితో పాటుగా, బీఆర్ఎస్ మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు జోగు శ్రీనివాస్, మౌలాలి డివిజన్ అధ్యక్షుడు దుంబాల సత్తయ్య, సీనియర్ నాయకులు బుద్ధి నర్సింగ్ రావు,నవాబ్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.